తండ్రి కొడుకుల ఎమోషన్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న LYF!

తాజాగా విడుదలైన “LYF – Love Your Father” చిత్రం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలకి ముందే ట్రైలర్ తో ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ తో జనాల్లోకి బాగా వెళ్ళింది. రిలీజ్ అయ్యాక కూడా జనాల అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది. SPB చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి. ఈ సినిమా ఇంతలా ప్రేక్షకాదరణ పొందడానికి కారణం కంటెంట్. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా, చాలా అద్భుతంగా చూపించారు. గతంలో తండ్రి-కొడుకుల ఎమోషన్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల లిస్టులో ఈ సినిమా కూడా తప్పకుండా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా చూశాక కచ్చితంగా పిల్లలు తమ తల్లి దండ్రులను కౌగిలించుకొని ఎమోషనల్ అవ్వడం పక్కా. అనేలా ఈ సినిమా ఉంది. మొత్తానికి Love Your Father అనే టైటిల్ కి తగ్గట్టుగా ఈ సినిమా స్టోరీని చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు మూవీ టీం చాలా హ్యాపీగా ఉన్నారు. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు.

డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..” సినిమా చాలా బాగుందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంత చిన్న సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంది ఫోన్లు చేసి తమకు ఈ సినిమా చూశాక వాళ్ళ తండ్రి గుర్తొస్తున్నారు అని చెప్పారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. నిజంగా ఈ సినిమాకి ఇంతలా జనాలు కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి ఇంతలా తీసుకెళ్లిన మధు VR గారికి నా ధన్యవాదాలు. “అని అన్నారు.

ఇక నిర్మాత కిషోర్ రాఠి మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగుందని చూసినవారు అందరు అంటున్నారు. రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో గత నలభై ఏళ్లుగా ఇలాంటి కుటుంబ కథ చిత్రాలే తీస్తున్నాం. వాటిలో చాలా వరకు ప్రేక్షకుల ఆదరణలు పొందాయి. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. మా బ్యానర్ లో ఇలాంటి మంచి సినిమా రావడం గర్వంగా ఉంది. అందుకు ప్రేక్షకులకు చాలా థాంక్స్. ఇంతమంచి సినిమా తీసినందుకు డైరెక్టర్ పవన్ గారికి కూడా నా ధన్యవాదాలు” అని అన్నారు.

సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ – లవ్ యువర్ ఫాదర్
నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీబి చరణ్, కషిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
డైలాగ్స్ : నాగ మాధురి
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్
నిర్మాతలు : రామస్వామి రెడ్డి, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. సామ్రాజ్యం, ఎ. చేతన్ సాయిరెడ్డి.
ఆర్ట్: శంకర్ చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మొయిన్
ఎడిటర్ : రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు విఆర్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus