ఇటీవల కాలంలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే విడుదలకు ముందు ఎంతో కొంత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవాలి. ఈరోజుల్లో సినిమాకు పాటలతోనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో విడుదలైన కొన్ని గంటలకే లిరికల్ సాంగ్స్ ఏ స్థాయిలో వ్యూవ్స్, లైక్స్ అందుకుంటున్నాయి అనేది ప్రధాన అంశంగా మారింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న యూట్యూబ్ లిరికల్ వీడియో సాంగ్స్ లలో సర్కారు వారి పాటకు సంబంధించిన సాంగ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
మొత్తానికి కళావతి పాట సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదటి పాట ఆదివారం విడుదల చేయగా విడుదలయిన 24 గంటల్లోనే భారీ స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది. 20 గంటల్లోనే 12.4 మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. ఇక 24 గంటల్లో 14.78 మిలియన్ల వ్యూవ్స్ ను అందుకుంది. ఇక రెండవ స్థానంలో పుష్ప ఐటమ్ సాంగ్ ఊ ఉంటావా 12. 39 మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది.
టోటల్ గా ఇప్పటివరకు 24 గంటల్లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న యూ ట్యూబ్ లిరికల్ వీడియో సాంగ్స్ లిస్ట్ ఈ విధంగా ఉంది.
కళావతి – 14.78 మిలియన్స్
ఊ అంటావా – 12.39 మిలియన్స్
లాలా భీమ్లా – 10.20 మిలియన్స్
సానాకష్టం – 10.16 మిలియన్స్
సామీ సామీ – 9.06 మిలియన్స్
దాక్కో దాక్కో – 8.32 మిలియన్స్
భీమ్లా నాయక్ – 8.28 మిలియన్స్
మైండ్ బ్లాక్ – 7.87 మిలియన్స్
రాములో రాములో – 7.39 మిలియన్స్
నాటు నాటు – 7.36 మిలియన్స్
24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న లిరికల్ సాంగ్స్ లో థమన్ కంపోజ్ చేసిన పాటలు 5 ఉండడం విశేషం. ఇక అతనికి సర్కారు వారి పాట సినిమాతో మరింత భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడు అని చెప్పవచ్చు.