మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భవంతి నిర్మాణం విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. `మా` సంఘంలో దాదాపు 750 మంది కి పైగానే ఆర్టిస్టులు ఉన్నారు.ఇక సొంత భవంతి నిర్మాణం విషయంలో కచ్చితంగా 2019లో పునాది రాయి వేస్తామని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా చాలా ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ‘మా అసోసియేషన్’ సొంత భవంతి నిర్మాణానికి ఎంతో సహాయం చేశారని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. అమెరికాలో నిర్వహించిన నిధి సేకరణ కార్యక్రమానికి స్వయంగా మెగాస్టార్ విచ్చేసి… ఎంతో ప్రోత్సహించారని… దీనికి గాను 3కోట్ల వరకూ నిధులు అందాయని చెప్పుకొచ్చారు.
ఇక ప్రభాస్, నాగార్జున గారిని కూడా ఇటీవల సంప్రదించామని. వారు కూడా సానుకూలంగా స్పందించారని శివాజీ రాజా తెలియజేసారు. ఇద్దరూ కూడా ఎటువంటి సాయానికైనా… వారు తమ వంతు చేయడానికి సిద్ధంగా ఉన్నారని. ప్రభాస్ – నాగార్జున లది చాలా పెద్ద మనసని తెలిపారు.మా ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదని. మహేష్ గారితో చేయాల్సిన ఈవెంట్ కూడా దురదృష్టవశాత్తూ క్యాన్సిల్ అయ్యిందని…. అయినప్పటికీ నమ్రతగారితో ఎప్పుడూ ఈ విషయం గురించి డిస్కషన్లు చేస్తూనే ఉన్నామని… పేదల సాయం కోసం వారు ముందుకు వస్తారని చెప్పారు. త్వరలోనే లండన్ లో కూడా ఓ నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని… ఏప్రిల్ లో ఈ కార్యకమాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.