సోషియల్ మీడియాపై ‘మా’ యుద్దం!!

సోషియల్ మీడియా…ఇప్పుడు తయారు అవుతున్న ఆయుధాల్లో అతి పదునైన ఆయుధం ఏమైనా ఉందా అంటే…ఆది సోషియల్ మీడియానే…ఎందుకంటే ఒకప్పుడు అందరూ ఎలెక్ట్రానిక్ మీడియాని ఫాలో అయ్యవాళ్ళు…కానీ సోషియల్ మీడియా పుణ్యమా అని, ఇప్పుడు ఎలెక్ట్రానిక్ మీడియా సైతం సోషియల్ మీడియాని ఫాలో అవుతుంది…వివరాల్లోకి వెళితే…టాలీవుడ్ విషయంలో సోషియల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎక్కువ శాతం ఫేక్ ఉంటూ ఉండడం, దాని వల్ల రకరకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉండడంతో దానిపై యుద్దం ప్రకటించింది మా అసోసియేషన్. వివరాల్లోకి వెళితే…వెబ్ సైట్స్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో సెలబ్రిటీలను కించపరుస్తూ రాస్తున్న వార్తలకు అడ్డుకట్ట వేయాలని, సినిమా స్టార్స్ పై ఎవరికివారు గాసిప్స్ పేరిట ఏవేవో పిచ్చిరాతలు రాసేస్తున్నారు. ఇలాంటి వార్తలపై తారలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కుటుంబసభ్యులు, అభిమానులు కూడా ఆ వార్తలను నిజమేనేమో అని నమ్మేంతగా ఆ వార్తలు ఉంటున్నాయి.

ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. అందుకే వాటన్నింటికీ సమాధానంగా…ఒక సరికొత్త ప్రణాళిక రచించుకుని ముందుకు సాగుదాం అని మా ప్రయత్నాలు ప్రారంభించింది…అందులో భాగంగానే..దీనికి సంబంధించి బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ ను ఆర్టీఐ ద్వారా సంప్రదిస్తే ఇది తమ పరిధిలోకి రాదని, సైబర్ పోలీసులను ఆశ్రయించాలని కోరింది. అక్కడ అభ్యర్థించినా … ఇలాంటివాటిపై తన నియంత్రణ ఉండబోదని తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర సమాచార ప్రసార శాఖను సంప్రదించాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భావిస్తోంది. ఇక దీనిపై మా మాజీ అధ్యక్షుడు మురళి మోహన్ స్పందిస్తూ…ఇలాంటి వాటిపై నియంత్రణ లేకపోతే మున్ముందు మరిన్ని విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాని ఆయన తెలిపారు. మరి ఏ అడుగు ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus