తెలుగు, తమిళ భాషల్లోని సినిమాలలో నటించి నటిగా మాధవీలత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జన్మించిన మాధవీలత చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారారు. తొలి ప్రయత్నంలోనే మాధవీలత బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోగా ఆ సినిమా నటిగా మాధవీలతకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత స్నేహితుడా, అరవింద్ 2, చూడాలని చెప్పాలని,
మరికొన్ని సినిమాలలో మాధవీలత నటించారు. అయితే ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీలత వేర్వేరు అంశాల గురించి స్పందించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా పాటపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. పురుషుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఈ సాంగ్ ఉందని ఏపీ పురుషుల సంఘం కోర్టు మెట్లెక్కింది.
అయితే ఈ వివాదం గురించి మాధవీలత స్పందిస్తూ పుష్ప మూవీ సాంగ్ మీద కేసు పెడుతున్నారట.. ఇలా కేసులు పెడితే 98 శాతం పాటలు ఇలానే ఉంటాయని ఆమె అన్నారు. ఇకపై పాటలు లేని సినిమాలు చేయాలని ఆమె చెప్పుకొచ్చారు. నేను కూడా అమ్మాయిలపై రాసే పాటల విషయంలో కేసు వేస్తానని మాధవీలత తెలిపారు. రారా సామీ పాటపై తాను కేసు వేస్తానని ఆ సాంగ్ వల్ల మహిళల పరువు పోయిందని ఆ పాట తనకు నచ్చలేదని మాధవీలత చెప్పుకొచ్చారు.
నేను కూడా కేసు పెడతానని తగ్గేదేలే అంటూ మాధవీలత ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. మాధవీలత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ పోస్ట్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పుష్ప మూవీ థియేటర్లలో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Most Recommended Video
మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్ టాలీవుడ్ హీరోలకు కలిసొచ్చిందా!