‘బిగ్ బాస్5’ : మానస్ కు పవన్ అంటే అంత పిచ్చా..వీడియో వైరల్!

  • December 9, 2021 / 03:43 PM IST

‘బిగ్ బాస్5’ లో 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మానస్…. తక్కువ టైంలోనే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. చాలా ప్రెజర్ సిట్యుయేషన్స్ లో కూడా ఇతను మెయింటైన్ చేస్తున్న కూల్ ను.. అలాగే ఆ టైములో ఇతను గేమ్ ఆడే విధానాన్ని చూసి హోస్ట్ నాగార్జున సైతం ఆశ్చర్యపోతున్నాడు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కూడా నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే.ట్రాన్స్ జెండర్ పింకీ పై ఇతను మొదటి నుండీ కేరింగ్ చూపిస్తే అది ఆమె ప్రేమ అన్నట్టు భావించి ఇతని పై వ్యామోహం పెంచుకోగా..

ఈ విషయం తెలిసి కూడా మానస్ తొందరపడి ఆమె పై అరవలేదు ఇగ్నోర్ చేయలేదు. సందర్భం కోసం వేచి చూసాడు.. ఓసారి హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ ముగిసిన తర్వాత పింకీతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది అని ఆగితే ‘ఫ్రెండ్ గా కలిసుంటాను సార్’ అంటూ కూల్ గా బదులిచ్చి ఆమెకు క్లారిటీ ఇచ్చాడు. వీటన్నిటినీ బేస్ చేసుకుని మానస్ కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..తాజా ఎపిసోడ్ లో ‘బిగ్ బాస్’… మానస్ కు ఓ టాస్క్ ఇచ్చాడు.

ఓ రోజంతా తమకు నచ్చిన స్టార్ హీరోలలా ప్రవర్తించాలి అని..! ఇంకేముంది మానస్ వెంటనే పవన్ కళ్యాణ్ అవతారం ఎత్తాడు.అనంతరం ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ కు పవన్ కళ్యాణ్ లా డ్యాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేసినప్పుడు అతని మేనరిజమ్స్ ఏ విధంగా ఉంటాయో.. అదే విధంగా మానస్ పెర్ఫార్మ్ చేయడం విశేషం. ఆ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus