Maayon Review: మాయోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

తెలుగు ప్రేక్షకులకు సత్యరాజ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో ఈయన కూడా సపోర్టింగ్ రోల్స్ విషయంలో స్టార్ గా రాణిస్తున్నారు. ఇండియా మొత్తానికి ఈయన ‘కట్టప్ప’ గా పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇక సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ ఈ ‘మాయోన్’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న మూవీస్ లిస్ట్ ను కనుక తీసుకుంటే అందులో ఈ ‘మాయోన్’ కూడా ఉంది. ‘మూవీ మ్యాక్స్’ ద్వారా మామిడాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మరి ఈ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ : ‘అర్జున్’ (శిబి రాజ్) పురావస్తు శాఖ (ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌)లో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. అతను సేకరించే పురాతన వస్తువులను డూప్లికేట్ చేసి అసలు వాటిని లక్షలకు, కోట్లకు అమ్మేస్తూ ఉంటాడు. ఇతని పార్ట్నర్ ఇన్ క్రైం గా సీనియర్ అధికారి గా దేవరాజ్ (హరీష్ పేరడీ) నటించారు. ఈ క్రమంలో మాయోన్మాల గ్రామంలో ఉన్న శ్రీ కృష్ణుడి దేవాలయంలో ఓ రహస్య గది ఉందని,అందులో నిధి ఉందని అర్జున్, దేవరాజ్ లు తెలుసుకుంటారు. ఆ నిధిని కనుక స్వాధీనం చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఆశపడతారు.

అందుకోసం ప్లాన్లు కూడా వేసుకుంటారు. ఈ క్రమంలో అంజన (హీరోయిన్ తాన్య రవిచంద్రన్) డీకే (భగవతి పెరుమాళ్) ను అర్జున్ కు సాయంగా నియమిస్తాడు దేవరాజ్. అక్కడికి వెళ్తే ప్రాణాలకే ప్రమాదం అని విని కూడా వీళ్ళు వెళ్తారు? మరి చివరికి వీళ్ళు నిధితో బయటకి వచ్చారా? కనీసం ప్రాణాలతో అయినా బయటకు వచ్చారా? అసలు ఆ గుడిలో ఉన్న ప్రమాదం ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : సిబిరాజ్..కు ఇది మొదటి సినిమా అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కలగలేదు. అతను తన తండ్రి సత్యరాజ్ లానే ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని లుక్స్ కూడా బాగున్నాయి.యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా చేశాడు. అతను హీరో మెటీరియల్ అని ట్రైలర్ చూసినప్పుడే ప్రేక్షకులు కామెంట్లు చేశారు. వారి అంచనాలకు తగ్గట్టు అతను తన పాత్రకి న్యాయం చేశాడు.. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ కూడా ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించింది.

ఆమె తన పాత్రకి న్యాయం చేసింది. గ్రామ పెద్దగా రాధ రవి ,దేవరాజ్ పాత్రలో హరీష్ పేరడీ పర్వాలేదు అనిపించారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషించి సినిమాకు హైలెట్ గా నిలిచాడు. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు కిషోర్ కు ఇది మొదటి చిత్రం. అయినప్పటికీ మొదటి చిత్రానికి మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ను ఎంపిక చేసుకోవడం చాలా బరువైన బాధ్యత అని చెప్పాలి. అయినప్పటికీ అతను తడబడింది లేదు. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.అరుణ్ అందించిన స్క్రీన్ ప్లే..కి కూడా మంచి మార్కులు పడతాయి. ఫస్ట్ హాఫ్ సస్పెన్స్ తో, సెకండ్ హాఫ్ లో కొంత హారర్ ఫీల్ ను తర్వాత విజువల్ ఫీస్ట్ ను అందించారు. నిడివి 2 గంటల 13 నిమిషాలు మాత్రమే ఉండేలా చూసుకోవడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అని చెప్పుకోవాలి.ఇతని పనితనం ఎలా ఉంటుందో మనం ‘అఖండ’ ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చూశాం. దేవాలయం విజువల్స్ ను అతను బాగా ప్రజెంట్ చేశారు.ఇళయరాజా అందించిన సంగీతం కూడా బాగుంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీ గా ఉంటే బాగుండేది.

విశ్లేషణ : ఓవరాల్ గా ‘మాయోన్’ చిత్రం ఈ వీకెండ్ కు హ్యాపీ గా చూడదగ్గ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus