Sreeleela: మ్యాడ్ హీరో పై ఫైర్ అయిన శ్రీలీల!

శ్రీలీల ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంటే అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో పాటు చలాకీ తనంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల. దసరా కానుకగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్న శ్రీలీల,

ఆ సినిమా ఇంకా రన్నింగ్ లో ఉన్నప్పుడే ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 24 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది శ్రీలీల. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ జోష్ లో ఉంది శ్రీలీల. నిన్న ఆమె మరియు వైష్ణవ్ తేజ్ కలిసి ‘మ్యాడ్’ చిత్రం లో ఒక హీరో గా చేసిన సంగీత్ శోభన్ తో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫన్నీ గా సాగిపోయింది. (Sreeleela) శ్రీలీల మీద సంగీత్ వేసిన జోక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మేము ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాం, అందులో నువ్వే హీరోయిన్, మూడు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు ఉండే సాంగ్స్ ఉంటాయి’ అని అంటాడు. అప్పుడు శ్రీలీల మాట్లాడుతూ ‘అదేంటి..నేను డ్యాన్స్ కి తప్ప దేనికీ పనికిరానా?, ఈమధ్యనే భగవంత్ కేసరి తో నటిగా నిరూపించుకున్నాను కదా’అని అంటుంది.

అలా చాలాసేపు ఫన్నీ గా నడిచిపోయిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. కొత్తరకం సబ్జక్ట్స్ ని ప్రోత్సహించడం లో ముందు ఉండే వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా తన కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాడు. రీసెంట్ గానే విడుదలైన ట్రైలర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus