Madala Ravi: పోరాడే రెబల్.. నటుడు మాదాల రవి బర్త్ డే స్పెషల్
- July 29, 2026 / 01:14 PM ISTByPhani Kumar
మాదాల రంగారావు తెరకెక్కించిన ‘ఎర్రమల్లెలు’ సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు మాదాల రవి(Madala Ravi). ఆ చిత్రంలో ‘నాంపల్లి స్టేషన్ కాడి’ అనే పాట చాలా ఫేమస్. ఇప్పటికీ ఎక్కడోక చోట ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. రష్యాలో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం పూర్తి చేసిన రవి…. ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అంతేకాదు అక్కడి భారతీయ సంస్థలకు, సాంస్కృతిక వ్యవహారాల విభాగానికి సాంస్కృతిక కార్యదర్శిగా సేవలందించారు.
Madala Ravi
ఇండియాకి వచ్చాక సొంత నిర్మాణ సంస్థను స్థాపించి.. ‘నేను సైతం’, ‘మా ఇలవేల్పు’, ‘బ్రోకర్ 2’, ‘పంచముఖి’, ‘వీరగాధ’, ‘ఆజ్ కా ఇంక్విలాబ్’, ‘నాగ్ లక్ష్మి’ వంటి సినిమాలు నిర్మించడమే కాకుండా అందులో ప్రధాన పాత్రలు కూడా పోషించారు.

ఇప్పటికీ నటుడిగా, చిత్రనిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎం.డి, గ్యాస్ట్రోఎంటరాలజీలో డి.ఎం వంటి ప్రత్యేక వైద్య అర్హతలు కలిగిన డాక్టర్ మాదాల రవి గారి నిజమైన వైద్య సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వైద్యాన్ని వ్యాపారంగా చూడని ఆయన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తృత వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు సేవ చేశారు. ప్రధానంగా శ్రామిక కుటుంబాలు, రోజువారీ కూలీలు, ప్రత్యేక జీర్ణాశయ సంబంధిత వ్యాది గ్రస్తులు, నిరుపేద వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు.
నిస్వార్థంగా వైద్య సేవల అందించడం ద్వారా ఆయన పీపుల్స్ డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రజా నాట్య మండలి, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీల నాయకుడిగా, ఆయన అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, వాటిలో పాల్గొన్నారు. సామాజిక దురాగతాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి కళే అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన గట్టిగా నమ్ముతారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు.అంతేకాకుండా, చిత్ర పరిశ్రమ, నిరుపేద కార్మికుల కోసం ఉద్దేశించిన అన్ని సంక్షేమ పథకాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.
నటుడిగా, చిత్రనిర్మాతగా సాధించిన విజయాలకు అతీతంగా, సామాజిక కార్యకర్తగా, ప్రజల వైద్యుడిగా, నటుడిగా ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను ఆయన్ను ఎన్నో పురస్కారాలు లభించాయి. అలాంటి డా. మాదాల రవి గారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.













