Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మదరాసి’. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. పైగా దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల ‘మదరాసి’ పై పెద్దగా బజ్ లేదు. కానీ శివ కార్తికేయన్ ఉన్న సూపర్ ఫామ్ కారణంగా ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగింది.

Madharasi

 

ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘అమరన్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘మదరాసి’ కి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం  3.2 cr
సీడెడ్  1.5 cr
ఉత్తరాంధ్ర  1.5 cr
ఈస్ట్+వెస్ట్ 0.80 cr
కృష్ణా + గుంటూరు  2.0 cr
నెల్లూరు 0.50 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 9.5 cr

 

‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా  బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ‘అమరన్’ సినిమాకి ఆల్మోస్ట్ రెండింతలు బిజినెస్ చేసింది ‘మదరాసి’. ఆ సినిమా తెలుగులో ఫుల్ రన్ ముగిసేసరికి రూ.26 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. సో ‘మదరాసి’ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు భారీగానే వస్తాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తేనే.. ! లేదు అంటే ఆడియన్స్ కి ‘ఘాటి’ రూపంలో ఇంకో ఆప్షన్ ఉంది

‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus