Madhavan, Ram Charan, Jr NTR: చరణ్, తారక్ లపై మాధవన్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా నాలుగుసార్లు వాయిదా పడటంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల నిర్మాత దానయ్య సైతం భారీ మొత్తంలో నష్టపోతున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లేదా జులై నెలలో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. డిసెంబర్ నెలలోనే ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని మేకర్స్ ఆలస్యం చేయడంతో ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడే అవకాశం అయితే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ లో హీరోలుగా నటించిన చరణ్, తారక్ లపై కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ షాకింగ్ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్, చరణ్ లను చూస్తుంటే తనకు అసూయ కలుగుతోందని మాధవన్ అన్నారు. ప్రోమోలో ఎన్టీఆర్, చరణ్ వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయని మాధవన్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, చరణ్ మధ్య ఉన్న స్నేహం, సమన్వయం నాకు ఈర్ష్య పుట్టేలా చేస్తున్నాయని మాధవన్ వెల్లడించారు. అయితే ఎన్టీఆర్, చరణ్ విషయంలో తమకు గర్వంగా ఉందని మాధవన్ కామెంట్లు చేశారు. హ్యాట్సాఫ్ అంటూ చరణ్, తారక్ లను ప్రశంసిస్తూ మాధవన్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం మాధవన్ చేసిన కామెంట్లకు స్పందిస్తూ థాంక్యూ మ్యాడీ అని సమాధానం ఇవ్వగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం భారత్ లో కలెక్షన్ల రికార్డులను తిరగరాయబోతుందని మాధవన్ వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్ అంచనాలను మించి విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ సైతం నమ్మకంతో ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదలైన తర్వాత 1,000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus