సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఇష్టపడతారు. ఇలా తమ వారసత్వాన్ని తమ పిల్లలు కొనసాగించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగుతూ వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.ఇకపోతే మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టం తెలుసుకొని వారిని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే నటుడు మాధవన్. ఈయన ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అయితే ఈయన అలాగే తన కుమారుడు కూడా హీరో కావాలని మాధవన్ పట్టు పట్టలేదు తనకు నచ్చిన రంగంలోనే తనని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మాధవన్ కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ లో ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటూ ఇండియాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో పథకాలను అందుకున్నటువంటి వేదాంత్ తాజాగా మరో ఐదు పథకాలను గెలుచుకున్నారు. మలేషియాలో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో వేదాంత్ పాల్గొన్నారు.
ఈ కాంపిటీషన్లో భాగంగా 50, 100, 200, 400, 1500 మీటర్ల విభాగంలో వేధాంత్ సత్తా చాటి ఇండియా తరఫున బంగారు పతకాలు సాధించాడు.ఇక ఈ విషయాన్ని స్వయంగా మాధవ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ తన కుమారుడు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతూ పుత్రోత్సాహాన్ని తెలియజేస్తున్నారు.తన కొడుకు సాధించిన ఈ విజయంతో తనకు పుత్రోత్సాహం కలగడమే కాకుండా గాలిలో తేలిపోతున్నట్టు ఉందంటూ ట్వీట్ చేశారు. ఇక ఈయన ఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్ వేదాంత్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలాగే వేదాంత్ నుఎంతో క్రమశిక్షణగా పెంచిన (Madhavan) మాధవన్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం సెలబ్రిటీల పిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున పార్టీలు పబ్ అంటూ సందడి చేస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ మాధవన్ కుమారుడు అందుకు ఎంతో భిన్నంగా ఉన్నారని చెప్పాలి. ఈ విషయంపై నేటిజన్స్ మాధవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలా ఈయన ఒకేసారి ఇన్ని పథకాలు తీసుకురావడం మన ఇండియాకి గర్వకారణం అంటూ కొందరు ఈయన విజయం పై ప్రశంసలు కురిపించారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!