జనసేన పార్టీకి మద్దతు తెలిపిన మాధవీ లత..!
- March 20, 2018 / 06:24 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని (Jana Sena party) ప్రకటించిన తర్వాత సినిమా నటులు వేగంగా స్పందించడం లేదు. అతని చిన్న అన్న నాగబాబు, అన్న కొడుకు రామ్ చరణ్ లు మొదటి నుంచి మద్దతు తెలుపుతున్నారు. మిగతా స్టార్స్ మౌనంగా ఉన్నారు. అయితే తెలుగు అమ్మాయి, నటి మాధవీ లత పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ అంటూ ఈరోజు సంచలన కామెంట్స్ చేసింది. “నచ్చావులే” చిత్రం హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈమె ఆ తర్వాత అవకాశాలేక ఇంటికే పరిమితమైంది. తాజాగా పవన్ పార్టీకి మద్దతు తెలిపి వార్తల్లో నిలిచింది.
“పవన్ అంటే నాకు ప్రేమ అని గత పదేళ్లుగా ప్రతీ ఇంటర్వ్యూలో చెబుతున్నాను. అలాగే నాకు సమాజసేవ అన్నా చాలా ఇష్టం. అందుకే ‘నక్షత్ర ఫౌండేషన్’ను ప్రారంభించాను. కానీ సపోర్టు మరియు ఫండింగ్స్ లేక సర్వీస్ కు బ్రేక్ ఇచ్చాను. కానీ, సేవ చేయాలనే ఆశ మాత్రం చావలేదు. పవన్ అంటే నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు, ఆయన స్థాపించిన ‘జనసేన’ పార్టీకి నేను ఎందుకు సపోర్టు చేయకూడదు?. పవన్ కోసం నేను దేనికైనా రెడీ” అంటూ ఫేస్ బుక్ లో మాధవీలత పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ పవన్ అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె మాదిరిగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేకమంది నటీనటులు మద్దతు తెలుపుతారని పవన్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు














