Hema Attack: హేమ పై మండిపడ్డ శివబాలాజీ భార్య మధుమిత..!

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు నిన్న పూర్తయ్యాయి. ‘మా’ అధ్య‌క్షుడిగా విష్ణు మంచు ఎంపికయ్యారు.ప్రకాష్ రాజ్ ప్యానల్ పై ఆయన ప్యానల్ ఘన విజయం సాధించింది.మంచు విష్ణుకి 665 ఓట్లకు గాను ఏకంగా 381 ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. జనరల్ సెక్రటరీగా జీవిత పై రఘుబాబు విజయం సాధించారు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలిచారు, నాగినీడు పై ఆయన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన శ్రీకాంత్, బాబూ మోహన్‌ పై విజయం సాధించడం విశేషం.

మొత్తంగా 8 స్థానాలకి గాను విష్ణు ప్యానెల్ 6 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. ఇది పక్కన పెడితే.. నిన్న జరిగిన ‘మా’ ఎన్నికల్లో నటీనటుల మధ్య ఎన్నో గొడవలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రంకు వెళ్తున్న టైములో నటుడు శివ బాలాజీ అడ్డుకున్నాడని… నటి హేమ అతని చెయ్యిని కొరికారు. ‘ఆయనను తప్పుకోమని చెబితే అతను తప్పుకోకుండా అడ్డుకున్నాడని…అందుకే అలా చేయాల్సి వచ్చిందని’ హేమ పేర్కొంది.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హేమ చేసిన పనికి.. శివ బాలాజీ భార్య, నటి మధుమిత స్పందించి హేమ పై మండిపడ్డారు.ఆమె మాట్లాడుతూ… “అలాంటి పనులు మనుషులైతే చేస్తారా? చేయరు.. అంతకు మించి నేను ఏం చెప్పలేను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక తన భర్త శివ బాలాజీ గెలుస్తాడని మొదటి నుండీ తనకి నమ్మకం ఉన్నట్టు కూడా ఆమె తెలియజేసింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus