ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే..!

  • January 1, 2019 / 12:27 PM IST

షార్ట్ ఫిలిమ్స్ నుండీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది సక్సెస్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుజీత్, ప్రశాంత్ వర్మ,సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. ఇక చాలా మంది నటీనటులు వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలిం బ్యాచ్ ఒక కొత్త చిత్రం రూపొందించింది. ‘మధుర వైన్స్’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసారు. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

‘మధుర వైన్స్… ఓపెనింగ్ సూన్’ అంటూ ఈ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అంతా కొత్త వాళ్ళతో తెరకెక్కించిన ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందట. లొకేషన్లతో పాటు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ లు కూడా చాలా సహజంగా ఉంటాయనేది టాక్. ఇక ఈ రోజు డిసెంబర్ 31 కావడంతో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ‘వాట్సాప్ లో స్టేటస్’ లుగా కొందరు.. ఫేస్ బుక్,, ట్విట్టర్ లో ఇంకొందరు షేర్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే… ఇది మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఇక ‘ఆర్.కె. సినీ టాకీస్’ , ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ల పై శ్రీమతి పద్మావతి కొండేపు సమర్పణలో రాజేష్ కొండేపు నిర్మిస్తుండగా.. జయ కిశోర్ బండి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ శబరీష్ కో -ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక కార్తీక్ కుమార్ సంగీతమందిస్తుండగా… ‘ఎస్.వై.ఎన్.సి సినిమా’ సౌండ్ డిజైనర్లుగా పనిచేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus