శర్వానంద్, సిద్దార్థ్ లు హీరోలుగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. శర్వానంద్ గత 4 సినిమాలు పెద్దగా ఆడలేదు అయినప్పటికీ ఈ చిత్రానికి మంచి బిజినెస్ అవ్వడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.
ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 5.50 cr |
సీడెడ్ | 2.50 cr |
ఉత్తరాంధ్ర | 1.97 cr |
ఈస్ట్ | 1.24 cr |
వెస్ట్ | 0.95 cr |
గుంటూరు | 1.30 cr |
కృష్ణా | 0.96 cr |
నెల్లూరు | 0.65 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.07 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.41 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 16.48 cr |
‘మహా సముద్రం’ చిత్రానికి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి… ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు