శర్వానంద్ – సిద్దార్థ్ కలిసి నటించిన ఎమోషనల్ డ్రామా మహాసముద్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై మొదట్లో కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చాయి. కానీ ఈ సినిమా విడుదల తర్వాత మాత్రం అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. మిగతా సినిమాలు అన్నీ కూడా మంచి వసూళ్లను అందుకుంటూ ఉండగా మహాసముద్రం బాక్సాఫీస్ మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
ఇక మొదటి ఆరు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం | 1.91 cr |
సీడెడ్ | 1.13 cr |
ఉత్తరాంధ్ర | 0.83 cr |
ఈస్ట్ | 0.43 cr |
వెస్ట్ | 0.32 cr |
గుంటూరు | 0.57 cr |
కృష్ణా | 0.38 cr |
నెల్లూరు | 0.27 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.67 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.59 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.45 cr |
మాహా సముద్రం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే మరొక 11 కోట్లకు పైగా షేర్ ను అందుకోవాల్సి ఉంది. కానీ ఆరు రోజుల్లోనే ఈ సినిమా వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో పెద్దగా లాభాలు అందకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 100 ఆక్యుపెన్సీ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అలాగే పెళ్లి సందD సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం మహాసముద్రం సినిమాపై గట్టిగానే పడినట్లు అర్థమవుతోంది.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!