శర్వానంద్, సిద్దార్థ్ లు హీరోలుగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా స్లీప్ ఏసిందనే చెప్పాలి.
ఒకసారి 4(ఫస్ట్ వీకెండ్) రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
1.81 cr
సీడెడ్
1.04 cr
ఉత్తరాంధ్ర
0.83 cr
ఈస్ట్
0.43 cr
వెస్ట్
0.32 cr
గుంటూరు
0.57 cr
కృష్ణా
0.38 cr
నెల్లూరు
0.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.59 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
6.26 cr
‘మహా సముద్రం’ చిత్రానికి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.