గుడ్ న్యూస్ చెప్పబోతున్న రవీందర్ మహాలక్ష్మి దంపతులు?

కోలీవుడ్ ఇండస్ట్రీలో లిబ్రా ప్రొడక్షన్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. సెప్టెంబర్ ఒకటవ తేదీ వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా ఈ దంపతులు పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వీరు పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి కావడమే కాకుండా రవీందర్ అధిక బరువు ఉండడంతో వీరి పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.

రవీందర్ చూడటానికి అధిక శరీర బరువు ఉండటమే కారణం.మహాలక్ష్మి చూడటానికి ఎంతో నాజుగ్గా అందంగా ఉన్నప్పటికీ ఈమె తనని పెళ్లి చేసుకోవడంతో ప్రేమతో తనని పెళ్లి చేసుకోలేదని కేవలం తన డబ్బు ఆస్తిని చూసి మహాలక్ష్మి పెళ్లి చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున ఈ దంపతులపై భారీ ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. వీరి పెళ్లి గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం వాటిని లెక్కచేయలేదు. ఇలా తమ గురించి ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఈ దంపతులు మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియపరుస్తూ వచ్చారు.

ఇక పెళ్లి తర్వాత రవీందర్ మహాలక్ష్మికి ఖరీదైన కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలా ఈ దంపతులు ఎప్పటికప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్నటువంటి ఫోటోని రవీందర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి తల్లి కాబోతున్నారా అనే వార్త చర్చలకు దారితీసింది.

ఇందులో మహాలక్ష్మి కాస్త బొద్దుగా కనిపించడమే కాకుండా ఆమెకు బేబీ బంప్ ఉన్నట్టుగా కనిపించడంతో ఈమె తల్లి కాబోతున్నారా అనే వార్త వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోని రవీందర్ షేర్ చేస్తూ.. ఐ లవ్ యు చెప్పడంలోనే నా సంతోషం లేదు నేను ప్రేమను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నిజమైన ప్రేమ కూడా కారణం అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus