సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహానటి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గండిపేటలో జరుగుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో సావిత్రి జీవితంలో అటు వ్యక్తిగతంగానూ, ఇటు వృత్తి పరంగానూ చోటు చేసుకున్న వివిధ సంఘటనలను నాగ్ అశ్విన్ చూపించనున్నారు. సావిత్రి సినీ కెరీర్ కి సంబంధించి ఆమె అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. దీంతో ఆయా పాత్రలను ఇప్పుడు ఎవరెవరు పోషిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక తెలుగు నటుల విషయానికి వస్తే మహానటుడు ఎన్టీఆర్ పాత్ర కోసం తారక్ ని సంప్రదిస్తే చేయనని చెప్పారు.
అయినా చిత్ర బృందం ఎన్టీఆర్ ని ఒప్పించే పనిలో ఉన్నారు. అలనాటి విలక్షణ నటుడు ఎస్ వీ రంగారావు పాత్రలో మోహన్ బాబుని నటింపజేయించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఆ పాత్రలో మొదట ప్రకాష్ రాజ్ ని అనుకున్నప్పటికీ, మోహన్ బాబు అయితే మరింత బాగుటుందని ఆలోచిస్తోంది. ఇక ఏఎన్ఆర్ పాత్రలో నాగచైతన్య నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకరా ఇద్దరా ‘మహానటి’ చిత్రం ద్వారా అలనాటి నటుల పాత్రల్లో ఇంకెంతమంది యువ నటులు కనిపిస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
