“మహానటి” చిత్రానికి గుమ్మడికాయ కొట్టిన చిత్ర బృందం.!

అభినేత్రి సావిత్రి నటనను అనేక సినిమాల్లో చూసి ఆనందించాం. అనేక మంది ఆమె నుంచి పరోక్షంగా అభినయంలో శిక్షణ పొందారు. అటువంటి మహానటి జీవితంలోని రెండో వైపు కోణాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సావిత్రిపై బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీలో కీర్తిసురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా, సమంత జర్నలిస్ట్ గా కనిపించనున్నారు.

జెమినీ గణేషన్‌ పాత్రను యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌,  మాయాబజార్ డైరక్టర్ కేవీ రెడ్డి గా క్రిష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో గుమ్మడికాయ కొట్టారు. అంతేకాదు మహానటి సావిత్రి చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం కలిసి పనిచేసిన చాలామంది నటీనటులు షూటింగ్ అయిపోయినందుకు ఎమోషన్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్  అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus