వాయివేగంతో దూసుకుపోతున్న మహానటి!

  • May 19, 2018 / 04:44 PM IST

సమ్మర్ హాలీడేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, ఎవరూ కనీసం థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించని మే నెలలో సినిమా విడుదల. అన్నిటికీ మించి బుధవారం విడుదల.. ఇన్ని అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకులే ప్రచాకర్తలుగా విడుదలైన మొదటి రోజే విపరీతమైన పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన చిత్రం “మహానటి”. సావిత్రిగా కీర్తి సురేష్ నటన కానివ్వండి, నాగఅశ్విన్ దర్శకత్వ ప్రతిభ కానివ్వండి, నిర్మాణ విలువలు, సంగీతం అన్నీ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అందుకే ఈ చిత్రాన్ని వయోబేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. ముఖ్యంగా నిన్నటితరం మేటి నటి అయిన మహానటి సావిత్రి సినిమాలు చూస్తూ పెరిగిన పెద్దవాళ్ళందరూ చాలా ఏళ్ల తర్వాత ఒక సినిమా చూడడం కోసం థియేటర్ కి రావడం అనేది “మహానటి”తోనే జరిగింది.

అందువల్ల సాధారణంగా మాస్ సినిమాకి మాత్రమే వచ్చే రిపీటెడ్ ఆడియన్స్ క్లాస్ ఫిలిమ్ అయిన మహానాటికి కూడా క్యూకట్టడం విశేషం. రెండోవారంలో సినిమా టికెట్స్ కోసం కొందరు పలుకుబడి వాడుతుండగా.. కొందరు మూడునాలుగు రోజుల ముందే బుకింగ్స్ చేసుకొంటున్నారు. “మహానటి” అనంతరం విడుదలైన “మెహబూబా” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం, నిన్న శుక్రవారం విడుదలైన “కాశి” కూడా డిజాస్టర్ గా నిలవడంతో వచ్చే శుక్రవారం వరకూ “మహానటి”కి అడ్డులేకుండాపోయింది. ఓవర్సీస్ లో ఆల్రెడీ “2 మిలియన్” మార్క్ చేరుకొన్న “మహానటి” ఇదే స్పీడ్ తో ఇంకోవారంపాటు ఆడిందంటే.. సునాయాసంగా 100 కోట్ల గ్రాస్ ను సాధించడం అనేది సులభతరం అయిపోతుంది. క్లాస్ కంటెంట్ తో 100 కోట్ల షేర్ సాధించడం కష్టం కాబట్టి.. గ్రాస్ అయితే ఈజీగా కవర్ చేస్తుంది “మహానటి”. ఈ సినిమా గనుక 100 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఈ తరహా కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ ఇంకొన్ని వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus