అసలే “భరత్ అనే నేను” రిజల్ట్ & కంటెంట్ ఆ తరువాతి వారం విడుదలైన “నా పేరు సూర్య” మీద తీవ్ర ప్రభావం చూపాయి. “భరత్ అనే నేను” లాంటి క్లాసిక్ ఎంటర్ టైనర్ మీద ప్రేక్షకులు చూపిన కాన్సన్ ట్రేషన్ “నా పేరు సూర్య” అనే మాస్ ఎంటర్ టైనర్ మీద చూపలేదు. అందుకే వారం పూర్తవ్వడానికి ఇంకా రెండు రోజులే ఉన్నప్పటికీ.. ఇంకా ఓవర్సీస్ లో ఒన్ మిలియన్ క్రాస్ అవ్వలేదు అల్లు అర్జున్ చిత్రం. ఇలా వన్ మిలియన్ డాలర్స్ సంపాదించడానికి నానా ఇబ్బందులుపడుతున్న తరుణంలో వారం కూడా పూర్తవ్వకముందే బుధవారమే “మహానటి” రిలీజ్ అవ్వడం ఇప్పుడు ఓవర్సీస్ లో సూర్య పాలిట శాపంలా మారింది.
ఇవాళ విడుదలైన “మహానటి”ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళందరూ క్లాసిక్ అంటుండడంతో.. ఓవర్సీస్ ఆడియన్స్ అందరూ ఎలాగూ మాస్ కమర్షియల్ సినిమాల మీద కంటే కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు కాబట్టి ఇవాల్టి నుంచి ఓవర్సీస్ లో సూర్యకి వచ్చే ఆమాత్రం కలెక్షన్స్ కి కూడా బ్రేక్ పడినట్లే. అల్లు అర్జున్ మునుపటి చిత్రాలు “సరైనోడు, దువ్వాడ జగన్నాధం” కూడా ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో ఆడకపోవడం గమనార్హం.