విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే హీరోగా అతని సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా వాటికి ప్రమోషన్ చేయలేదు. అయితే అతని కెరీర్లో 50వ సినిమాగా రూపొందిన ‘మహారాజ’ ని జూన్ 14న తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ప్యాషన్ స్టూడియోస్’, ‘ది రూట్’ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ..లు నిర్మించారు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడం విశేషం.
తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ పై శశి రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.40 cr |
ఉత్తరాంధ్ర | 0.98 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.58 cr |
‘మహారాజ’ చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.2.58 కోట్ల షేర్ ను రాబట్టింది.3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా..రూ.0.78 కోట్ల లాభాలు అందించింది.