నాలుక తెస్తే కోటి.. ‘తాండవ్’ గొడవపై సంచలన ప్రకటన!

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘తాండవ్’. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సిరీస్ కి రేటింగ్స్ పరంగా తక్కువ స్టార్లు వచ్చినప్పటికీ.. దీనిపై మొదలైన వివాదంతో ఈ సిరీస్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ఈ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు పెట్టారని.. హిందువుల దేవుళ్లను కించపరిచారని ఈ సిరీస్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది.

కొందరు రాజకీయనాయకులు సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. సిరీస్ బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇష్యూ పెద్దది అవుతుందని భావించిన మేకర్స్ అందరూ కలిసి క్షమాపణలు కోరారు. వివాదాస్పద సీన్లను తొలగించనున్నట్టు ప్రకటించింది. అయినా కూడా ఈ వివాదం సద్దుమణగలేదు. తాజాగా మహారాష్ట్ర కర్ణిసేన ‘తాండవ్’ ఈ వివాదంపై సంచలన రీతిలో స్పందించింది. ఈ వెబ్ సిరీస్ లో హిందూ దేవుళ్లు, దేవతలపై అనుచిత్ర వ్యాఖ్యలు చేసిన వారి నాలుక కత్తిరించి తెచ్చిన వారికి కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు కర్ణిసేన చీఫ్ అజయ్ సెంగార్ సంచలన ప్రకటన చేశారు.

‘తాండవ్’ దర్శకనిర్మాతలు క్షమాపణలు చెప్పినప్పటికీ అది సరిపోదని.. ఆ క్షమాపణలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ సిరీస్ రూపొందించినందుకు గాను అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కంటెంట్ ఇండియా హెడ్ అలీ అబ్బాస్ జాఫర్, వెబ్ సిరీస్ నిర్మాత హిమాంశు కృష్ణ మెహ్రా, రచయిత సోలంకి త‌దితరులపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus