సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ జ్యూక్ బాక్స్ విడుదల

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’, ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా..

ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’, ‘పాల పిట్ట..’ పాటలకు శ్రోతల నుండి అద్భుతైమెన స్పందన వచ్చింది. కాగా, మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus