మహేష్ బాబుని సైతం లెక్కచేయని డైలీ సీరియల్స్!

సాయంత్రమైతే చాలు గృహిణులు టీవీ లకు అతుక్కుపోతుంటారు. మనం ‘ఐపీయల్’ చూద్దామనుకున్నా.. సినిమాలు చూద్దామనుకున్నా.. ‘ నో వే’ … వాళ్ళు అస్సలు కంప్రమైజ్ అవ్వరు. దీంతో చేసేదేమి లేకుండా వాళ్ళు పెట్టే డైలీ సీరియల్స్ మాత్రమే చూసేవాళ్ళు కొంతమంది ఉంటే.. మరికొంతమంది మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని చాటింగులు, బ్రౌజింగ్ లు చేసుకునే వాళ్ళు మరికొందరుంటారు. అయితే అలా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న సమయంలో.. సీరియల్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఒక్కసారిగా సీరియల్ వైపు తిరుగుతారు. ఎందుకంటే మనం ఎక్కడో విన్న సినిమా పాటో.. లేదా మనం చూసిన సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరో వినపడుతుంది. అవును ఇందులో సందేహమే లేదు.

అయితే ఇప్పటి వరకూ టీవీల్లో టెలికాస్ట్ చేసిన తరువాత ఆయా సినిమా పాటనో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నో వాడుతూవచ్చారు. కానీ ఇంకా రిలీజ్ కూడా అవ్వని ఓ సినిమాలోని పాటని ఓ సీరియల్ లో వాడేశారు. ఇంతకీ ఏ సినిమాలో పాట అది? అనేగా మీ డౌట్. అదేనండీ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలోని పాట. ఈ మద్యే విడుదల చేసిన ‘ఇదే కదా… ఇదే కదా’ అనే పాటని ఓ సీరియల్లో ఫుల్ గా వాడేశారు. ఇది చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో పెట్టాడు. అంతే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇది చూసిన ప్రతీ ఒక్క నెటిజెన్ షాకవుతున్నాడు. సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు సీరియల్లో వాడటం కొత్తేమీ కాదు. కానీ విడుదలవ్వక ముందే మహేష్ లాంటి స్టార్ హీరో చిత్రంలోని పాటనే సీరియల్లో వాడేస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది కదూ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus