Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

చిన్న సినిమాల గురించి మహేష్‌బాబు ఇచ్చే ప్రోత్సాహం (సోషల్‌ మీడియా పోస్టులు) స్పెషల్‌గా ఉంటుంది అని చెప్పాలి. సినిమా చూశాక ఆ టీమ్‌ని మెచ్చుకుంటూ ఆయన చేసే పోస్టులు ఓ లెవల్‌లో ఉంటాయి. అలా ఇప్పుడు ఆయన ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమా గురించి ఓ పోస్టు పెట్టారు. అందులో ఆ సినిమా దర్శకుడు సింజిత్‌ గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. దీంతో వైరల్‌ కూడా అవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే తన ఫ్యాన్‌ కోసం రాసిన మాట అది.

Mahesh Babu

చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ‘లిటిల్‌ హార్ట్స్‌’. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ స్టార్‌ నటుఉ పోస్ట్‌లు పెడుతున్నారు. అలా అగ్ర కథానాయకుడు మహేశ్‌ బాబు కూడా సినిమాకు ఫిదా అయ్యారు. దీంతో తనదైన శైలిలో చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘లిటిల్‌ హార్ట్స్‌’ ఆద్యంతం సరదాగా సాగిన వినోదభరితమైన సినిమా. నటీనటులు కొత్తవారే అయినా బాగా నటించారు. అద్భుతమైన నవ్వుల రైడ్‌ ఈ చిత్రం అని రాసుకొచ్చారు.

అక్కడితో ఆగకుండా సింజిత్‌ నువ్వు ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌.. ఎందుకంటే నువ్వు కొన్నిరోజుల్లో బిజీగా మారిపోతావ్‌’ అని రాశారు. ఆయన ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనే విషయం తెలిసిందే. మహేశ్‌ ఇలా ప్రత్యేకించి సంగీత దర్శకుడిని కారణముంది. సింజిత్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మహేశ్‌కు వీరాభిమానినని చెప్పారు. ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమా గురించి పోస్ట్‌ పెడితే తన ఆనందానికి హద్దులు ఉండవని కూడా చెప్పారు.

ఆ ఆనందంలో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్ చేసుకుని వారం రోజులు ఎటైనా వెళ్లిపోతానని కూడా చెప్పారు. ఇప్పుడు మహేష్‌ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే సినిమా గురించి, సింజిత్‌ పనితనం గురించి రాసుకొచ్చారు.దీనికి సింజిత్‌ రిప్లై కూడా ఇచ్చారు. ‘నేను ఇంకా ఎక్కడికీ వెళ్లను అన్నా’ అంటూ తన అభిమానాన్ని సంబరాలు జరుపుకునేలా చెప్పాడు. ఇక దర్శకుడు మార్తాండ్‌ అయితే టపాసులు కాల్చి మరీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. అభిమాన హీరో ట్వీట్‌ వేస్తే అలా ఉంటుంది మరి.

పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus