సామ్ ని టార్గెట్ చేసిన బన్నీ, మహేష్ ఫ్యాన్స్!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ఫోకస్ బాగా ఎక్కువైంది. మన తారలు తమ సోషల్ మీడియా అకౌంట్ లో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న తప్పు దొర్లిందో ఇంక అంతే.. వాళ్లని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ సమంత కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. అసలు విషయానికొస్తే.. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా గత నెలలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన సమంత సినిమా అద్భుతంగా ఉందంటూ ఈ నెలారంభంలో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ అంటూ సూర్య సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ పోస్ట్ చూసిన మహేష్, బన్నీ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. దీంతో ఆమెని ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడి మరీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ ల కెరీర్ లో ఈ సినిమాలు ఆల్ టైమ్ హిట్లుగా నిలిచాయి. దీంతో సూర్య సినిమాకు సమంత ఇచ్చిన కాంప్లిమెంట్ తమ హీరోల సినిమాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా నచ్చితే అభినందించడంలో తప్పు లేదని.. కానీ ఫిలిం ఆఫ్ ది ఇయర్ అంటూ మిగతా సినిమాలను తక్కువ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ ని సమంత పెద్దగా పట్టించుకోవడం లేదు!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus