Mahesh Babu: డేట్‌ చెప్పారు సరే… ఇంకా చాలా సెలవులున్నాయి… మళ్లీ టూర్‌ అంటే కష్టమే!

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాకు షూటింగ్‌ రోజులు తక్కువ, గ్యాప్‌ తీసుకునే రోజులు ఎక్కువ. ఈ మాట మేం అనడం లేదు. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ స్టైల్‌ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ మధ్య మొదలైన సినిమా… వివిధ కారణాల వల్ల వాయిదా పడుతోంది. మొదలైంది, స్పీడ్‌ అందుకుంటుంది అనుకున్నప్పుడల్లా మహేష్‌బాబు తన కుటుంబంతో కలసి టూర్‌కి వెళ్తున్నారు. ఇటీవల దీనిపై మహేష్‌ రియాక్ట్‌ అయ్యాడు. అయితే దాని మీద నెటిజన్లు కూడా రియాక్ట్‌ అవుతున్నారు.

మహేష్‌బాబు మంచి ఫ్యామిలీ మ్యాన్‌. వరుస సినిమా చిత్రీకరణల మధ్య ఏ మాత్రం గ్యాప్‌ దొరికినా కొత్త ప్రదేశానికి టూర్‌కి వెళ్లిపోతుంటాడు. అలా ప్రపంచంలో చాలా ప్రదేశాలు చుట్టేశారు. ఇదే విషయాన్ని ఇటీవల మీడియా సమావేశంలో ప్రస్తావిస్తే… ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. దీంతో ఇప్పుడు ఆయన మాటలు వైరల్‌ అవుతున్నాయి. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడల్లా లేదంటే పిల్లలకు సెలవులు వచ్చినప్పుడల్లా చిన్నపాటి సెలవులకు వెళతాను అని చెప్పాడు. నా వెకేషన్ పిక్స్ నీకు నచ్చాయా, లేక అసూయ పడుతున్నావా అని మహేష్ బాబు సరదాగా అన్నాడు.

మహేష్‌బాబు (Mahesh Babu) విదేశాల్లో గడిపిన రోజుల్లో సగం రోజులు సినిమాకు కేటాయిస్తే, ఈ పాటికి ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ అయిపోయేదంటూ మహేష్ బాబుపై విమర్శలు గుప్పించేవాళ్లు ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా ను సంక్రాంతికి తీసుకొస్తామని అంటున్నారు. ఈ లోపు చాలా సెలవు రోజులు, పండగలు ఉన్నాయి. పిల్లలకు సెలవులు వస్తాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మహేష్‌ టూర్‌కి వెళ్లిపోతే సినిమా అనుకున్న సమయంలో పూర్తవుతుందా అనే ప్రశ్న కూడా వేస్తున్నారు. మరి దీనికి మహేష్‌ ఏమంటాడో చూడాలి.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబు గుంటూరు ప్రాంతంలో ఓ డాన్‌గా కనిపిస్తాడని ఇటీవల ఓ పుకారు వచ్చింది. అందులో ఓ హీరోయిన్‌ మరదలు కాగా, మరో హీరోయిన్‌ రిపోర్టర్‌గా కనిపిస్తుంది అంటున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus