Mahesh Babu: మహేష్ బాబు మొబైల్ రింగ్ టోన్ తెలిస్తే షాక్ అవుతారు..!

యువతతో పాటు మహిళా అభిమానులను సైతం సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. ఆయన సినిమా వస్తుందంటే, అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా ఉండే ఆయన తరచూ వర్కవుట్‌లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పంచుకుంటారు. ఇటీవల వరుసగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు పంచుకోవడంతో అందరూ రాజమౌళి సినిమా కోసం ఇప్పటి నుంచే మహేశ్ కష్టపడుతున్నారని రాసుకొచ్చారు.

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మహేశ్‌బాబు ఆ పోస్ట్‌లపై స్పష్టత ఇచ్చారు. జిమ్‌లో వర్కవుట్‌ చేసే వీడియోలు, ఫొటోలు ఎప్పటినుంచో షేర్‌ చేస్తున్నానని అన్నారు. రాజమౌళితో సినిమా ఇంకా ప్రారంభం కాలేదని, అందుకు సమయం ఉందన్నారు. ఒకవేళ ఆ సినిమా కోసం కసరత్తులు చేయడం మొదలు పెడితే, ఆ విషయాన్ని తానే స్వయంగా చెబుతానన్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ విడుదలపై నెలకొన్న అనుమానాలకు తెర దించారు.

సినిమాను కచ్చితంగా సంక్రాంతికి తీసుకురానున్నట్లు తెలిపారు. ‘కచ్చితంగా వచ్చే సంక్రాంతికి ‘గుంటూరు కారం’ తీసుకొస్తాం. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడం ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నాం. గౌతమ్‌ పుట్టినప్పటి నుంచి ఏదో విధంగా చిన్నపిల్లలకు సాయం చేయాలని అనుకున్నా. అందుకే చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా. అలాగే రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే ఇచ్చేస్తున్నాం.

అందరిలానే నేనూ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగానే ఉపయోగిస్తా. ఫోన్‌ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నా. ‘మీ మొబైల్‌ రింగ్‌ టోన్‌ ఏంటి’ అని అడుగుతున్నారు. ‘నాది సైలెంట్‌ టోన్‌’ (నవ్వులు). నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే, విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం నేను షాపింగ్‌ చేస్తా. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’’ అని మహేశ్‌బాబు (Mahesh Babu) చెప్పుకొచ్చారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus