Mahesh Babu: నిర్మాతలు ఈ విషయం చెప్పగానే హ్యాపీగా ఫీలయ్యా: మహేష్ బాబు

సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట్లో మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డుల సునామి సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టి విజయం అందుకోవడంతో చిత్రబృందం ఈ సినిమా సక్సెస్ పార్టీని కర్నూలులో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ విజయోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు.

ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ…ఒక్కడు సినిమా తరువాత తిరిగి ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని కర్నూలులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ పార్టీని కర్నూలులో నిర్వహిస్తున్నాము అని చెప్పగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అంటూ మహేష్ బాబు తెలిపారు.ఇక ఈ సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా చూస్తున్న సమయంలో తన కొడుకు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడని తన పిల్లల రియాక్షన్ తెలియజేశారు.

ఇకపోతే ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా ఇంత విజయాన్ని అందుకుంది అంటే అందుకు కారణం డైరెక్టర్ పరుశురామ్ అంటూ తెలియజేశారు. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ పరశురామ్ కి దక్కుతుందని మహేష్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో కరోనా కారణం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇలా ఎంతో కష్టపడి ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశామని మహేష్ బాబు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ సినిమాకు మీరు అందించిన ఈ విజయం ముందు ఆ రెండేళ్ల కష్టం పూర్తిగా మర్చిపోయామని,ఈ సినిమా కోసం ఎంతో క్లిష్ట పరిస్థితులలో కూడా పనిచేసిన టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలకు ఇతర నటీనటులకు మహేష్ బాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus