Mahesh, Gautham: హాట్ టాపిక్ అయిన మహేష్, గౌతమ్..ల లేటెస్ట్ ఫోటో.!

టాలీవుడ్లో 6 అడుగులకి పైగా హైట్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ హైట్ కి తగ్గట్టు స్టిఫ్ గా, స్టైలిష్ గా ఉండే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్ (Prabhas) ఇంకొకరు మహేష్(Mahesh Babu). ప్రభాస్ హైట్ 6 అడుగుల 2 అంగుళాలు, మహేష్ హైట్ 6 అడుగుల ఒక్క అంగుళం. వీళ్ళని మించి హైట్ ఉన్న హీరోలు టాలీవుడ్లో ఉన్నారు కానీ.. వాళ్ళని సైతం తమ ఛార్మింగ్ లుక్స్ తో డామినేట్ చేసేస్తారు ప్రభాస్, మహేష్..లు అనడంలో సందేహం లేదు..!

ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.. అది తెలీని విషయం కాదు. కానీ మహేష్ బాబుకి పెళ్ళై.. కొడుకు, కూతురు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ మధ్యనే అతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లు మహేష్ బాబు కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫొటోలో మహేష్ బాబు లుక్ హైలెట్ అయ్యింది. అది అతని నెక్స్ట్ సినిమా గురించి కావచ్చు.

అయితే మహేష్ బాబు కంటే గౌతమ్ ఇంకా హైట్ గా ఉండటాన్ని ఎక్కువగా గమనించి ఉండరు. అవును లేటెస్ట్ ఫొటోల్లో అతను మహేష్ బాబు కంటే హైట్ గా కనిపించాడు. అవును 18 ఏళ్ళ వయసుకే గౌతమ్ తన తండ్రి మహేష్ బాబుని మించి హైట్ అయ్యాడు. అతను ఇంకా హైట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

మరోపక్క పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా కూడా  (Pawan Kalyan) 6 అడుగుల 5 అంగుళాల హైట్ ఉన్నాడు. ‘అతని హైట్ ని గౌతమ్ మ్యాచ్ చేసే ఛాన్స్ ఉందా?’ అనే చర్చలు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. ఏదేమైనా గౌతమ్ ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇస్తే ఘట్టమనేని ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus