మహేష్ బాబు, నమ్రత కలిసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తో ఫోటో దిగడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘సర్కారు వారి పాట’ చిత్రం తర్వాత ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లిన మహేష్ బాబు.. ఫారెన్ రోడ్ల పై చక్కర్లు కొడుతూ తెగ తిరుగుతున్నాడు.అయితే బిగ్ గేట్స్ వద్దకు వెళ్లి ఫోటో దిగేంతలా మహేష్ బాబుకు ఏం పని పడింది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు షురూ అయ్యాయి.
ఈ ఉదయమే మహేష్ దంపతులు లెజెండరీ బిల్ గేట్స్‌ను కలిసినట్టు తెలుస్తుంది. మనకి ఉదయం అంటే వాళ్ళకి మధ్యాహ్నం లేదా సాయంత్రం అవుతుంది. మహేష్ బాబు బిల్ గేట్స్‌కి పెద్ద అభిమానిలా ఫీలయ్యి ఫోటో దిగాడు. లక్షలాది మంది అభిమానులు మహేష్‌తో ఫోటో దిగాలని పరితపిస్తుంటే మహేష్ మాత్రం ఫ్యాన్‌బాయ్‌గా మారి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ తో ఫోటో దిగాడు.”మిస్టర్ @బిల్‌గేట్స్‌ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది!
ఈ ప్రపంచం చూసిన గొప్ప వారిలో ఆయన కూడా ఒకరు. అంతేకాకుండా ఆయన విజన్ ,వినయం ఎంతో స్ఫూర్తిదాయకం” అంటూ బిల్ గేట్స్‌తో మహేష్,నమ్రత లు దిగిన ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ ఫోటో పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ సినిమాలోలా బిల్ గేట్స్ వద్ద మహేష్ వడ్డీ వసూల్ చేయడానికి వెళ్లాడా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆ సినిమాలో కూడా మహేష్ పేరు మహేష్ కావడం విశేషం. ఇక ప్రస్తుతం మహేష్… త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.మహేష్ కెరీర్లో 28వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
Vadhi Vasool Cheyadaniki Veladhu Babu🤭😅 pic.twitter.com/iEN9LZcwk0
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) June 29, 2022
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!