Mahesh Babu, Rana: క్రేజీ వెంచర్‌కు సిద్ధమవుతున్న క్రాస్‌ రోడ్స్‌

మహేష్‌బాబు, దగ్గుబాటి కుటుంబాలు జట్టు కట్టబోతున్నాయి. ఇదేదో సినిమా కోసం అనుకునేరు. సినిమా ఆడించడం కోసం. అంటే థియేటర్‌ కోసం. మార్కెట్‌ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే… నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఈ మల్టీప్లెక్స్‌ రాబోతోందట. నిజానికి అక్కడ చాలా థియేటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండేవాళ్లు… అక్కడ కనీసం ఒక్క సినిమా అయినా చూడాలని అనుకుంటారు. సరిగ్గా అక్కడే ఈ మల్టీప్లెక్స్‌ ఉండబోతోందట. ఇంకా చెప్పాలంటే అది ఓ పెద్ద షాపింగ్‌ మాల్‌ అని చెబుతున్నారు.

ఇప్పటికే దగ్గుబాటి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ శాతం సింగిల్‌ స్క్రీన్లే. మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి ఇప్పుడు గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. మహేష్‌బాబు విషయానికి వచ్చేసరికి ఇప్పటికే ఏంఎబీ మాల్‌ ఏర్పాటు చేసుకున్నాడు. విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లో మహేష్‌బాబు – రానా – వెంకటేశ్‌ కలసి ఈ బిగ్గెస్ట్‌ మాల్‌ రూపొందిస్తున్నారట. ఎప్పట్లాగే ఈ మాల్‌లో ఏసియన్‌ సినిమాస్‌ భాగస్వామ్యం ఉంటుంది.

సినిమా హీరోల మల్టీప్లెక్స్‌లకు ఏసియన్‌ భాగస్వామిగా ఉంటోంది. ఈ క్రమంలో అమీర్‌పేట సత్యం థియేటర్‌ను ‘AAA’పేరుతో పునర్‌నిర్మిస్తున్నారు. మొన్నే మహబూబ్‌నగర్‌లో విజయ్‌ దేవరకొండ AVD స్టార్ట్‌ అయిన విషయం తెలిసిందే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus