SSMB28: ‘మహేష్ 28’.. నిర్మాతలకు అదో టెన్షన్ ..!

మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమా ఏమీ రాలేదు. కానీ ఇంకో 20,30 ఏళ్ళైనా గుర్తుంచుకునే సినిమాలు వచ్చాయి. ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాలను బుల్లితెర పై రిపీటెడ్ గా చూస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఆ చిత్రాలను నిర్మించిన నిర్మాతలు, కొనుగోలు చేసిన బయ్యర్లు సంగతి ఏంటి? ‘అతడు’ చిత్రాన్ని ఆ రోజుల్లోనే రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ దానికి జరిగిన బిజినెస్ రూ.16 కోట్లు మాత్రమే. కానీ ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.17 కోట్ల పైనే షేర్ ను రాబట్టడంతో బయ్యర్స్ సేఫ్ అయిపోయారు.

తర్వాత డిజిటల్ రైట్స్ కూడా భారీగా సేల్ అవ్వడంతో నిర్మాత మురళీ మోహన్ కూడా గట్టెక్కేసారు. కానీ ‘ఖలేజా’ పరిస్థితి అలా లేదు. ఆ చిత్ర నిర్మాతలతో త్రివిక్రమ్ ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టించాడు. రూపాయి పెట్టాల్సిన చోట పది రూపాయలు పెట్టించాడు. పైగా ఎక్కువ బడ్జెట్ తో తీసిన చాలా సీన్లు సినిమాలో లేవు. తర్వాత సినిమాని భారీ రేట్లకు అమ్మారు. పెట్టిన పెట్టుబడులు రికవరీ కాక బయ్యర్లు చాలా కాలం అవస్థలు పడ్డారు. ఇప్పుడు ‘మహేష్ 28’ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయితే కష్టమైపోతుంది.

అందుకే నిర్మాతలు.. ప్రీ ప్రొడక్షన్ విషయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం వల్ల ఏ రోజు ఎలా ఉంటుందో తెలియడం లేదు. పైగా మార్కెట్లో ఏది కొనాలన్నా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇండస్ట్రీలో నోటెడ్ యాక్టర్స్.. కార్ వ్యాన్ లేకపోతే షూటింగ్ కు రాము అని చెప్పేస్తున్నారట. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాతలు బడ్జెట్ శృతి మించకుండా మొదటి నుండి జాగ్రత్త వహించాలని భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus