SSMB28: మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే.. కానీ..!

రెండేళ్ళుగా త్రివిక్రమ్ కొత్త సినిమా మొదలు కాలేదు. 2020 వ సంవత్సరంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాల పనులు చూసుకుంటూ వస్తున్నాడు. మరోపక్క పవన్ చేయబోయే తర్వాత సినిమాల స్క్రిప్ట్ పనులని కూడా త్రివిక్రమే చూసుకుంటున్నాడు. ‘భీమ్లా నాయక్’ పనులు పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి సంబంధించిన పనులని మొదలుపెట్టాడు త్రివిక్రమ్. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

మే 31కి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డేకి ఓ గ్లిమ్ప్స్ రెడీ చేయాలనేది ఓ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇక సినిమాని 6,7 నెలల్లో ఫినిష్ చేసి 2023 సంక్రాంతికే విడుదల చేద్దామనే టార్గెట్ ను కూడా పెట్టుకున్నాడు. హీరోయిన్ గా పూజ హెగ్డే ఫిక్స్ అని అనౌన్స్ చేశారు.ఇంకో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉంది కానీ ఆమె ఎవరు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు.తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి డిసెంబర్ లోనే ఈ చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టాలి అనుకున్నారు. కానీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పనులు ఓ పక్క అలాగే మహేష్ బాబు కాలికి సర్జెరీ అవ్వడంతో డిలే అయ్యింది. కచ్చితంగా ఈ ఏడాదిలోపే ఈ మూవీ ఫినిష్ అవ్వాలి. ఎందుకంటే మహేష్-రాజమౌళి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రారంభం కావాల్సి ఉంది.

ఆ మూవీ కోసం మహేష్ మేకోవర్ కూడా ఛేంజ్ చేయాలి. ఈ పాండమిక్ టైములో త్రివిక్రమ్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి..!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus