సినిమా హోల్డ్ లో పెట్టాడు.. ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాడు.. మహేష్ తెలివే వేరబ్బా..!

మహేష్ బాబు 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ చివరికి సక్సెస్ ఫుల్ మూవీ గానే నిలిచింది. ఈ చిత్రం నుండీ మహేష్- వంశీ లు మంచి సన్నిహితులైపోయారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత వంశీతోనే తదుపరి సినిమా చేస్తానని మహేష్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వంశీ వినిపించిన స్క్రిప్ట్ తో సంతృప్తి చెందక ఆ ప్రాజెక్టు ను హోల్డ్ లో పెట్టి పరశురామ్ ‘సర్కారు వారి పాట’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.

పోనీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక.. మళ్ళీ మహేష్- వంశీ కాంబోలో సినిమా ఉంటుంది అనుకుంటే.. మధ్యలో రాజమౌళి వచ్చి మహేష్ తో తన తదుపరి సినిమా ఉంటుంది అని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహేష్, వంశీ ల మధ్య గ్యాప్ వచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం. ప్రస్తుతం వంశీ తో సినిమా చెయ్యలేకపోతున్న మహేష్.. అతనితో ఓ వెబ్ సిరీస్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే మహేష్ చిన్న సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు మహేష్. ఇప్పుడు వంశీ పైడిపల్లితో వెబ్ సిరీస్ లు కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ పైనే మహేష్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నాడు మహేష్.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus