Mahesh Babu, Anil Ravipudi: మహేష్ అలా చేస్తే జక్కన్న ఒప్పుకుంటారా?

Advertisement

మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ అనిల్ రావిపూడి మధ్య బంధం కూడా బలపడిందని బోగట్టా. అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కు మహేష్ ఫిదా అయ్యారని తెలుస్తోంది. ఈతరం డైరెక్టర్లలో వేగంగా సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న దర్శకునిగా అనిల్ రావిపూడికి పేరుంది.

అయితే మహేష్ బాబు అనిల్ రావిపూడికి మరో ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ నటించాల్సి ఉంది. ఏదైనా కారణాల వల్ల జక్కన్న మూవీ ఆలస్యమైతే మహేష్ అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని బోగట్టా. ఒకవేళ రాజమౌళి సినిమా అనుకున్న సమయానికి మొదలైతే మాత్రం రాజమౌళి మూవీ తర్వాత అనిల్ మహేష్ కాంబోలో మూవీ ఉండనుంది.

త్రివిక్రమ్ మూవీ తర్వాత అనిల్ మూవీలో నటిస్తానంటే రాజమౌళి ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. మహేష్ అనిల్ రావిపూడి కాంబోలో అధికారిక ప్రకటన రాకపోయినా మరో సినిమా తెరకెక్కడం మాత్రం ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాజాగా జరిగిన ఒక పార్టీలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తానని మహేష్ బాబు చెప్పారని తెలుస్తోంది. మహేష్ అనిల్ కాంబో మూవీ గురించి ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కదని సమాచారం.

ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారో లేక మరో నిర్మాత ఈ సినిమా కోసం పని చేస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు మహేష్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలామంది డైరెక్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమాతో భాషతో సంబంధం లేకుండా మహేష్ బాబుకు క్రేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus