సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీకి వాస్కోడిగామా, స్టన్ గన్, ఎనిమీ అని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తన సినిమా విషయాల్లో అసలు జోక్యం చేసుకొని సూపర్ స్టార్ ఈ సినిమా పేరు గురించి డైరక్టర్ కి ఒక మాట చెప్పినట్లు తెలిసింది.
టైటిల్ నిర్ణయం పూర్తిగా డైరక్టర్ కే ఇచ్చిన ప్రిన్స్, రెండు భాషల్లో ఒకే పేరు ఉండేలా చూడమని చూసించారంట. మహేష్ చెప్పినట్లుగానే తెలుగు, తమిళ భాషల్లో సెట్ అయ్యే పేరును సెట్ చేసే పనిలో డైరక్టర్ పడ్డారని చిత్ర బృందం తెలిపింది. “ఎనిమీ” టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల కానుంది.