సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగానే, మహేష్ బాబు చిన్నప్పటి నుంచి సాహసాలకు వెనుకాడలేదు. ఇప్పుడు కూడా స్పైడర్ సినిమాని ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో పూర్తి చేసి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే.. తమిళ హీరోలు ద్విభాషా చిత్రాలు మంచి విజయాన్ని అందించుకున్నాయి. కానీ తెలుగు హీరోలు అలా చేసి విజయాన్ని అందుకోలేకపోయారు. పాతికేళ్ల క్రితం నాగార్జున రక్షకుడు అనే ద్వి భాషా చిత్రాన్ని తీశారు. ఘోర పరాజయం అయింది. దీంతో ఆ జోలికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వెళ్ళలేదు.
తర్వాత హీరోలు కూడా ఆ సాహసం చేయలేదు. తొలిసారి మహేష్ స్పైడర్ తో సాహసం చేశారు. కోలీవుడ్ లో నాగార్జున విజయం సాధించలేకపోయారు.. అటువంటిది మహేష్ వల్ల అవుతుందా? అని అందరూ సందేహిస్తున్నారు. ఈ అనుమానాలు ఈనెల 27 తో పటాపంచలు కానుంది. స్పైడర్ రెండు భాషల్లోనూ ఘానా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది.