Jaya Krishna Ghattamaneni: జయకృష్ణ ఘట్టమనేని ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా?

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి కొంతమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ మహేష్ బాబు (Mahesh Babu) తప్ప ఇంకెవ్వరూ క్లిక్ అవ్వలేదు. రమేష్ బాబు (Ramesh Babu) నుండి చూసుకుంటే నరేష్ (Naresh) కొడుకు నవీన్ కావచ్చు, సుధీర్ బాబు (Sudheer Babu) కావచ్చు. అశోక్ గల్లా (Ashok Galla) కావచ్చు..! ఎవ్వరూ కూడా స్టార్స్ కాలేకపోయారు. ఘట్టమనేని అభిమానులు కూడా వారిని పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేదు. సుధీర్ బాబు ఓ హిట్టు కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇంకోరకంగా ఎదురీదుతున్నాడు అని చెప్పాలి.

Jaya Krishna Ghattamaneni

స్టార్ అయ్యేందుకు కావాల్సిన ఫిజిక్ అతనికి ఉన్నప్పటికీ …ఎందుకో నెగ్గుకు రాలేకపోతున్నాడు. ఘట్టమనేని లెగసీని మహేష్ మాత్రమే లాక్కొస్తున్నాడు. అతని కొడుకు గౌతమ్ హీరో అయ్యేందుకు టైం పడుతుంది. అప్పటివరకు భారమంతా మహేష్ మోయాల్సిందే అని అంతా అనుకుంటున్నారు. అయితే సడన్ గా రమేష్ బాబు కొడుకు జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అవును జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా ఫోటో షూట్లు నిర్వహించారు. చూడటానికి చక్కగా ఉన్నాడు.

మంచి రంగు,తేజస్సు కలిగి ఉన్నాడు.బాబాయ్ మహేష్ బాబులానే ఇతను కూడా 6 అడుగుల హైట్ ఉన్నాడు. ప్రస్తుతం ఇతని డెబ్యూ మూవీ కోసం కథలు అన్వేషణలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాచారం. మంచి లవ్ స్టోరీతో ఇతను హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. అలా కాదు కమర్షియల్ పంధాలో నడవాలి అనుకుంటే.. జయకృష్ణ.. మహేష్ బాబులా చాలా కష్టపడాల్సి ఉంటుంది. చూడాలి.. ఇతను కనుక హిట్ అయితే ఘట్టమనేని ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ అవుతుంది.

చరిత్రలోనే అతిపెద్ద హైజాక్‌.. వెబ్‌ సిరీస్‌ రెడీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుండంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus