Mahesh Babu: 50 కోట్ల ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేస్తున్న మహేష్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు సర్కారు వారి పాట వంటి సినిమాలతో ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా మహేష్ బాబు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నిర్మాతలకు కూడా అధిక లాభాలు వస్తున్నాయి.

మహేష్ బాబు ఈ విధంగా ఒక వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణంలో తెరకెక్కిన మేజర్ సినిమా అధిక లాభాలను తెచ్చిపెట్టింది. ఇకపోతే ఈయన నటించిన సర్కారు వారి పాట,ఈయన నిర్మాణంలో తెరకెక్కిన మేజర్ సినిమా విజయవంతం కావడంతో మహేష్ బాబు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబుకు హైదరాబాద్ చెన్నై వంటి నగరాలలో ఎంతో ఖరీదైన ఆస్తిపాస్తులు ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఏకంగా విదేశాలలో కూడా పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మహేష్ బాబు అమెరికాలో ఏకంగా 50 కోట్లు ఖర్చుచేసి ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ఈ విధంగా మహేష్ బాబు 50 కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు కోట్లలో ఖరీదు చేసే ఫ్లాట్ కొనుగోలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పలువురు భావిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus