Mahesh Babu: మహేష్ అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటీవల అంటే ఉగాది రోజున ‘సర్కారు వారి పాట’ సెకెండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టాడు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువైన నేపథ్యంలో పెద్ద సినిమాల షూటింగ్లు వరుసగా ఆగిపోవడాన్ని మనం చూస్తూనే వస్తున్నాం. పైగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సైతం కరోనా భారిన పడుతుండడం అందరినీ కంగారు పెడుతున్న అంశం. ఇలాంటి టైములో ‘మహేష్ బాబు షూటింగ్ మొదలుపెట్టి రిస్క్ చేస్తున్నాడా?’ అని అంతా అనుకున్నారు.

ఆ అనుమానాలకు తగినట్టుగానే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఆగిపోయింది. ఆ టీం లో కొంత మంది కరోనా భారిన పడటం అలాగే మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కూడా కరోనా సోకడంతో షూటింగ్ ఆగిపోయింది. మహేష్ బాబు వెంటనే హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయాడు. అయితే గత 4 రోజులుగా అతని గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు మహేష్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. వీళ్ళందరి భయాలను పటాపంచలు చేస్తూ నిన్న ఓ ఫోటోని షేర్ చేసాడు మహేష్.

ఇందులో తన కూతురు సితార తో అలాగే తన పెంపుడు కుక్క తో సరదాగా ఆడుకుంటున్నాడు మహేష్. ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అలాగే తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు కూడా మహేష్ బాబు స్పష్టంచేశాడు. అందరినీ వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా కోరాడు. ఫైనల్ గా ఒక్క ఫొటోతో మహేష్ తన అభిమానులకు పెద్ద రిలీఫ్ ఇచ్చాడనే చెప్పాలి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus