‘పూరీ’కి ప్రిన్స్ కండీషన్స్!!!

టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం…హీరో ఇమేజ్ ఉండాలే కానీ, ఏం చేసిన అడిగే దిక్కే ఉండదు. ఇంతకీ విషయం ఏమిటంటే….ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఎంతటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడో అందరికీ తెలీసు. అంతేకాకుండా ఎలాంటి సినిమాలు తీసాడొ కూడా అందరికీ తెలిసిందే.

అయితే అలాంటి పూరీ జగన్నాధ్ కి మన ప్రిన్స్ మహేష్ బాబు వార్నింగ్ కొన్ని కండీషన్స్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి…ఇంతకీ ఏంటి ఆ కండీషన్స్ అంటే….రీసెంట్ గా పోకిరి సినిమా పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహేష్ తో జనగణమన అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశాడు పూరీ. అదే క్రమంలో ప్రిన్స్ తో సినిమా ఉంది అన్నట్లు సంకేతాలు సైతం అభిమానుల్లోకి పంపించాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే మహేష్ తో కథా చర్చలు ముగించుకున్న పూరి, ప్రిన్స్ కొన్ని కండీషన్స్ పెట్టడంతో తొలుత హాక్ అయ్యినప్పటికీ ఆ తరువాత ఒకే చెప్పేసాడంటా…ఇంతకీ ఏంటో ఆ కండీషన్స్ అంటే…ప్రిన్స్ పూరితో సినిమా చెయ్యాలి అంటే…కళ్యాణ్ రాంతో తీస్తున్న సినిమా హిట్ కొట్టాలని చెప్పాడట.

అంతేకాకుండా ప్రిన్స్ కోసం తయారు చేసుకున్న కధని మొత్తం పూర్తి చేశాకనే సెట్స్ మీదకు వెళ్లాలని మొదటి సగంతోనే స్టార్ట్ చేసి రెండో సగం మధ్యలో చేయడం లాంటివి వద్దన్నాడు. అంతేకాదు తన సినిమా కోసం పబ్లిసిటీకే దాదాపు 5 కోట్ల దాకా పెట్టేలా ప్లాన్ చేయాలని.. సినిమా కూడా ముందు రెండు
సినిమాల కన్నా టేకింగ్ పరంగా అదిరిపోవాలని మాట్లాడారట. ఇలా తనకు అనుకూలంగా కండీషన్స్ పెట్టాడు ప్రిన్స్. ఇక వాటికి ఒకే చెప్పిన పూరీ…ఇప్పుడు ఫోకస్ మొత్తం కల్యాణ్ రాం సినిమాపై పెట్టాడట…మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus