కన్నడనాట చిరును బీట్ చేసిన మహేష్

  • August 6, 2020 / 09:40 PM IST

మహేష్ సక్సెస్ జర్నీ కొనసాగుతుంది. భరత్ అనే నేను చిత్రంతో ఫార్మ్ లోకి వచ్చిన మహేష్ మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ మహేష్ కేరీర్ బెస్ట్ వసూళ్లు సాధించడంతో పాటు టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ ని మేజర్ అజయ్ కృష్ణగా ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేశారు. దాదాపు 13ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. రష్మిక గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్ అలరించాయి. కాగా ఈ మూవీ బుల్లితెరపై ఆల్ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

జెమినీ మూవీలో ప్రసారం అయినా సరిలేరు నీకెవ్వరు 23.4 టీఆర్పీ దక్కించుకొని సరికొత్త రికార్డు నమోదు చేసింది. 22.7 టీఆర్పీ రేటింగ్ తో టాప్ లో ఉన్న బాహుబలి 2 చిత్ర రికార్డు సరిలేరు నీకెవ్వరు బీట్ చేసింది. కాగా కన్నడలో కూడా మహేష్ రికార్డు నమోదుచేశారు. అక్కడ బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ దక్కించుకున్న టాలీవుడ్ డబ్బింగ్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు మూవీని కన్నడలో డబ్ చేసి బుల్లితెరపై ప్రసారం చేశారు. కాగా సరిలేరు నీకెవ్వరు కన్నడ వర్షన్ మేజర్ అజయ్ కృష్ణ మూవీ 6.5 టీఆర్పీ దక్కించుకుంది.

ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రం పేరిట ఉన్న 6.3 రికార్డుని మహేష్ బ్రేక్ చేశాడు. దీనితో తెలుగు నుండి కన్నడలో అత్యధిక టీఆర్పీ అందుకున్న చిత్రంగా మేజర్ అజయ్ కృష్ణ నిలిచింది. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట పై కూడా ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకుడు కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus