ఆలియాతో సితార.. నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫోటో..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి(చరణ్) సరసన సీత పాత్రలో కనిపించబోతుంది ఆలియా. ఈరోజు ఆలియా పుట్టినరోజు కావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఆలియా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. కొద్దిసేపటికే ఇది వైరల్ కూడా మారింది. అయితే కొంతమంది ఆలియా పై ట్రోల్స్ కూడా చేస్తుండడం షాకిచ్చే అంశం.

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లో బీనా ఆంటీ లా ఉంది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా ఆలియా.. మహేష్ కూతురు సితారతో దిగిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… ఆలియా… మహేష్ – నమ్రత ల ఫ్యామిలీతో కూడా సత్సంబంధాలను మెయింటైన్ చేస్తుందట.బహుశా రాజమౌళి- మహేష్ సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా ఫైనల్ అయ్యుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో ఉన్న ఆలియాను ఆమె పుట్టినరోజు సందర్భంగా మహేష్ దంపతులు తమ ఇంటికి ఆహ్వానించారట. ఈ క్రమంలో సితార పాప కోసం ఓ గిఫ్ట్ ను కూడా తీసుకెళ్లింది ఆలియా. ఆ టైములో ఆలియా- సితార లు.. ఇదిగో ఇలా ఫోటో తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఫోటోని చూసిన మహేష్ అభిమానులు సంతోష పడుతూ.. ‘సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus