Mahesh Babu: ఫ్యాన్స్ కోరికను సూపర్ స్టార్ నెరవేరుస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. నెగిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తక్కువ రేట్లకే సర్కారు వారి పాట సినిమా హక్కులను విక్రయించడంతో ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అభిమానులు ఆశిస్తుండటం గమనార్హం.

సర్కారు వారి పాట రిజల్ట్ విషయంలో మహేష్ బాబు అభిమానులు సంతృప్తితో ఉన్నారు. అయితే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఫేవరెట్ హీరోను డ్యూయల్ రోల్ లో చూడాలని ఉందని ఫుల్ లెంగ్త్ పాత్రలలో మహేష్ ఈ విధంగా కనిపిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు బాల్యంలో పలు సినిమాలలో డ్యూయల్ రోల్ లో కనిపించారు. హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన తర్వాత నాని సినిమాలో మాత్రం మహేష్ కొంతసేపు డ్యూయల్ రోల్ లో కనిపించారు.

ఈ మధ్య కాలంలో మహేష్ ఈ తరహా పాత్రలలో కనిపించలేదు. మరి ఫ్యాన్స్ కోరిక విషయంలో మహేష్ బాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక కాగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ సినిమాను వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత త్రివిక్రమ్ పై ఉంది.

మహేష్, త్రివిక్రమ్ ఈ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus