రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అంతటా పాజిటివ్ గా ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో మహేష్ ఫ్యాన్స్ సైతం సంతోషంగా ఫీలవుతున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే తర్వాత సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి సినిమాలలో ఏ సినిమాకు రాని స్థాయిలో కొన్ని విషయాలకు సంబంధించి ఆర్ఆర్ఆర్ విషయంలో విమర్శలు వచ్చాయి.
రాజమౌళి ఆ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని తర్వాత సినిమా విషయంలో జాగ్రత్త వహిస్తే సినిమా ఫలితం మరింత మెరుగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాజమౌళి కథ, కథనం విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ మూవీలో విలనిజం పవర్ ఫుల్ గా ఉండేలా జక్కన్న చూసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను జక్కన్న త్వరగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జక్కన్నకు సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన లాభాల్లో 30 శాతం లాభాలు రాజమౌళికి రెమ్యునరేషన్ గా దక్కింది. మహేష్ సినిమాకు జక్కన్న ఎంత మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకుంటారో చూడాలి. జక్కన్నకు ఉన్న క్రేజ్ వల్ల ఆయన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. రాజమౌళి మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?