Mahesh Babu New Look: మహేష్ ప్రయోగంతో టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్ల క్రితం వరకు ప్రతి సినిమాలో ఒకే లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. లుక్ విషయంలో విమర్శలు వచ్చినా మహేష్ ఆ కామెంట్లను పట్టించుకునేవారు కాదు. అయితే మహేష్ బాబు మహర్షి సినిమా నుంచి లుక్ విషయంలో చాలా మారారు. కొత్త లుక్ లో కనిపించడానికి ప్రస్తుతం మహేష్ బాబు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ లుక్ కు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

మహేష్ బాబు తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. త్రివిక్రమ్ సినిమా వర్క్ మొదలైందని త్రివిక్రమ్, థమన్, నిర్మాత వంశీతో దిగిన ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో మహేష్ లుక్ కు సంబంధించి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు లుక్ బాలేదని నెటిజన్లు, మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సాధారణంగా మహేష్ ఫోటోలు ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఎవరు మీలో కోటీశ్వరులు, అన్ స్టాపబుల్ షోలలో మహేష్ లుక్స్ బాగున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా మహేష్ షేర్ చేసిన ఫోటోలో లుక్ మహేష్ అభిమానులనే మెప్పించలేదు. మహేష్ సైతం తన అభిమానులు ఇతర హీరోల అభిమానులతో పోలిస్తే డిఫరెంట్ అని ఏదైనా నచ్చకపోతే ముందే చెబుతారని ఒక సందర్భంలో అన్నారు. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ లుక్ ఇదే అయితే మాత్రం ఫ్యాన్స్ కు మరింత టెన్షన్ తప్పదు.

కొత్త లుక్ తో మహేష్ ప్రయోగం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus